NTV Telugu Site icon

Allu Arjun Advocate: పోలీసులు కావాలనే అల్లు అర్జున్ బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారు..

Allu Arjun Bail

Allu Arjun Bail

Allu Arjun Advocate: చంచల్‌గూడ జైలు నుంచి ఈ రోజు ఉదయం 6.30 గంటలకు విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తరపు అడ్వకేట్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జులన్ రిలీజ్ అయ్యారు అని తెలిపారు. ఇక, తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేశాయని చెప్పుకొచ్చారు. అయితే, వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ లో స్పష్టంగా ఉన్నప్పటికి.. కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని వెల్లడించారు. అయితే, అధికారులకు బెయిల్ కాపీలు ఆలస్యంగా అందడం వల్ల అల్లు అర్జున నిన్న రిలీజ్ కాలేదు.. అల్లు అర్జున్ ఆలస్యంగా విడుదల అవ్వడంపై మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని ఆయన తరపు అడ్వకేట్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Aadhaar Update: ఆధార్ ఉన్నవారికి అలెర్ట్.. ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవడానికి నేడే లాస్ట్

కాగా, సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. అయితే, ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్‌ లాయర్లు 50 వేల రూపాయల పూచీకత్తును చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. అలాగే, హైకోర్టు నుంచి బెయిల్‌ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందించడంతో.. అల్లు అర్జున్‌ రాత్రంతా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, నేటి ఉదయం చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్‌ వెళ్లిపోయారు.

Show comments