The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!

The Paradise Ott Release Date

The Paradise Ott Release Date

The Paradise: వెండితెరపై ఆశించిన ఫలితం రాకపోయినా, డిజిటల్ వేదికపై మాత్రం న్యాచురల్ స్టార్ నాని తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో, ఎస్ఎల్వీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా, అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో విడుదలయ్యాక ఆ అంచనాలను అందుకోవడంలో ఈ ప్రాజెక్ట్ తడబడింది.

బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం, తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆశ్చర్యకరంగా థియేటర్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్టింట ఇప్పటికీ నెగెటివ్ రివ్యూలు వినిపిస్తున్నప్పటికీ, వాటన్నింటినీ తుత్తునియలు చేస్తూ నాని తన స్టార్ ఇమేజ్‌తో ఓటీటీలో సంచలనం సృష్టించారు. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకున్న ‘ది ప్యారడైజ్’, ఇండియా వైడ్ టాప్ ట్రెండింగ్ చార్ట్స్‌లో ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. కథాకథనాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఓటీటీ మార్కెట్‌లో నాని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని ఈ రికార్డు చాటిచెబుతోంది. ప్రారంభంలోనే ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం, రానున్న రోజుల్లో మరెన్ని వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.