NTV Telugu Site icon

Mollywood : రిస్క్ చేస్తోన్న మాలీవుడ్ ఇండస్ట్రీ.. తేడా వస్తే అంతే.!

Mollywood

Mollywood

కోవిడ్ టైం నుండి మాలీవుడ్ సినిమాకు మహర్ధశ పట్టింది. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన మూవీ లవర్స్ ఆహా, ఓహో అని పొగిడేయడంతో కేరళ చిత్రాలకు ఎక్కడలేని హైప్ వచ్చింది. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం, పాన్ ఇండియాచిత్రాలు చేయకపోయినప్పటికీ గుర్తింపు రావడంతో రేంజ్ పెరిగింది. ఈ ఎలివేషన్‌తో డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది మాలీవుడ్. బాక్సాఫీసులు షేక్ చేసేందుకు స్టార్ హీరోలను రంగంలోకి దింపింది. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్‌తో మల్టీ స్టారర్ చిత్రాన్ని పట్టాలెక్కించింది.

Also Read : Pushpa – 2 : బాలీవుడ్ లో కొనసాగుతున్న పుష్పరాజ్ హవా

మహేష్ నారాయణన్ దర్వకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ రీసెంట్ టైమ్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మల్టీ స్టార్స్‌ నటిస్తోన్న ఈమూవికి మరింత హైప్ తెచ్చేందుకు భారీ రిస్క్ చేస్తున్నాడు నిర్మాత. 100 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు ప్రొడ్యూసర్ వెల్లడించారు. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన తార, కుంబికో బొబన్, ఫహాద్ ఫజిల్, అసిఫ్ అలీ లాంటి స్టార్స్‌ యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షార్జాలో ఫస్ట్‌ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కానీ ఇప్పటి వరకు మమ్ముట్టి నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరలేదు. ఇక కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ లూసిఫర్, పులి మురుగన్ హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లో ఉన్నాయి. అలాగే 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రలో వంద కోట్లు వసూలు చేసిన సినిమాలు పట్టుమని పది కూడా లేవు. అలాంటిది ఇంతటి భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారంటే మేకర్స్ భారీ రిస్క్ చేస్తున్నారని తేడా వాటి అంతే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show comments