పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వింటేజ్ వైబ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. వచ్చే సంక్రాంతికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య రాజాసాబ్ కాస్త సైలెంట్ అయ్యాడు. పెద్దగా అప్డేట్స్ ఏమి రావడం లేదు. దీంతో సినిమా మరోసారి పోస్ట్‌పోన్ అయిందనే వార్తలు వచ్చాయి. కానీ, అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
Also Read : NTRNEEL : వేట కి సిద్ధమవుతున్న టైగర్.. లుక్ రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్
డిసెంబరు 25 వరకు ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని, అలాగే అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ కూడా ఈవెంట్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇక ఇప్పుడు అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ముందుగా రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే తమన్ అదిరిపోయే సాంగ్ రెడీ చేసినట్టుగా తెలిసింది. ఈ నెల మూడవ వారంలో సాంగ్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా ఇక్కడి నుంచి ప్రతి పది రోజులకి ఒక సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం అదిరిపోయే ట్రైలర్ కట్ చేయబోతున్నాడు మారుతి. ఇక్కడితో సినిమా పై అంచనాలు పీక్స్‌కు వెళ్లాలనేది మారుతి ప్లాన్.క్రిస్మస్ కానుకగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతుండగా జనవరి మొదటి వారంలో తెలుగులో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 9ఎం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది రాజాసాబ్.
