టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజ సజ్జా.. యంగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో అని భాషలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇదే మెరుపు వేగంతో మరొక అడుగు ముందుకేసే ప్రయత్నంలో, సూపర్ హీరోగా మరో విభిన్నమైన కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అదే ‘మిరాయ్’.
Also Read:Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ కీలక పాత్రలో సోషిస్తుండగా, మంచు మనోజ్ విలన్ రోల్ తో ప్రేక్షకులను షాక్ ఇవ్వనున్నాడని టాక్. ఇదిలా ఉంటే తాజాగా మూవీ టీం ‘మిరాయ్’ రిలీజ్ కొత్త డేట్ అనౌన్స్ చేసింది.
ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలి. కానీ అనుకోని కారణాల వలన మళ్ళీ జూన్‌కి షిఫ్ట్ చేశారు. ఇక ఇప్పుడు మరికొంత సమయం తీసుకొని న్యూ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. మేకర్స్ తాజాగా మిరాయ్ పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఆగస్టు 1న, ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2డి, 3డి ఫార్మాట్స్ లో మూవీని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక మంచి అవుట్ పుట్ కోసం దర్శక నిర్మాతలు ఎక్కువ టైమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.