Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), భార్య ఆర్తి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి వీడాకులకు సంబందించిన న్యాయపరమైన వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. గత కొంతకాలంగా విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచిన ఈ జంట మధ్య కోర్టు వివాదాలు మరింత ముదిరాయి. తాజాగా ఆర్తి తన పిల్లల ఖర్చులు, భరణం విషయమై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తన పిల్లల పాఠశాల ఫీజులతో సహా రోజువారీ భరణం ఖర్చులను రవి మోహన్ ఏప్రిల్ 2025 నుండి అందించడం లేదని ఆర్తి ఆరోపించారు. పిల్లల చదువు, ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అందుకే తాను న్యాయ సహాయం కోరాల్సి వచ్చిందని ఇటీవల కోర్టుకు తెలియజేశారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న తన మధ్యంతర భరణం పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరపాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్తి దాఖలు చేసిన ఈ అత్యవసర పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫ్యామిలీ కోర్టులో ఉన్న భరణం పిటిషన్‌ను తక్షణమే విచారణకు స్వీకరించి రెండు వారాల్లోగా దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో జయం రవి, ఆర్తిల వివాదంలో ఫ్యామిలీ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్తితో విడిపోయిన జయం రవి కొంతకాలంగా సింగర్ కేనికతో స్నేహంగా మెలిగారు. కానీ ఇక నావల్ల కాదని జయం రవికి దూరంగా వెళ్తున్నానని ప్రకటన చేయడంతో ఆర్తి తనకు కావాల్సిన వారిని కూడా వేధిస్తోందని జయం రవి సంచలన ఆరోపణలు చేసారు.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
తాజావార్తలు
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!