NTV Telugu Site icon

Yahs: ‘టాక్సిక్’ సినిమా విడుదల పై లేటెస్ట్ బజ్..!

February 7 2025 02 20t073543.691

February 7 2025 02 20t073543.691

రాకింగ్ స్టార్ యష్‌ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ కెరీర్ ఒక సారిగా మారిపొయింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా హిందీ‌లో తెగ పాపులర్ అయిపొయాడు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై  ప్రేక్షకులో భారీ హైప్ నెలకొంది. కాగా ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నాడు.

గోవా మాదక ద్రవ్యాల బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కెవిఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీయర అద్వాని హీరోయిన్‌గా,సూపర్‌ స్టార్‌ నయనతార, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్, బాలీవుడ్‌ హీరోయిన్‌ హ్యూమా ఖురేషీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ పై మరో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసి ఈ ఏడాది ఏప్రిల్ రిలీజ్‌ చేయలనుకున్న సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ‘టాక్సిక్’ ఈ ఏడాది డిసెంబర్‌కి వాయిదా వేసేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉందట. మరి చూడాలి దీనిపై అధికారిక అనౌన్సమెంట్ ఏమన్నా వస్తుందా లేదా?