NTV Telugu Site icon

Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు

Kunchako

Kunchako

ముమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్లు.. సౌబిన్ షాహీర్, టొవినో థామస్, బసిల్ జోసెఫ్ లాంటి జూనియర్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జోజూ జార్జ్ సేమ్ ఏజ్ గ్రూప్ హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే ‘కుంచికో బోబన్’ మాత్రం సోలో హీరోగా హిట్టు కొట్టేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. ఏడాది కాలంగా అతడితో బ్లాక్ బస్టర్ హైడ్ అండ్సీసిక్ ఆడుతోంది. 2018 సినిమా తర్వాత సోలో హీరోగా వచ్చిన పద్మిణీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది

Also Read : Anil Ravipudi: అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇదేనట!

పద్మినీ తర్వాత వచ్చిన చావీర్, గుర్ర్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన బోగన్ విల్లా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డైలామాలో పడిన ఈ యాక్టర్ ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ హీరో బిజు, ఉదాహరణం సుజాత, ఎలా వీజ పూంచిరతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన జిత్తు అష్రఫ్‌కు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. జిత్తు డైరెక్షన్ లో కుంచికో బోబన్ హీరోగా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ త్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 20న థియేటర్లలో తీసుకు వస్తున్నారు మేకర్స్. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది ఈ ప్రాజెక్టుతో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో మహేష్ నారాయణన్ మల్లీ స్టారర్ మూవీలో బాగస్వామ్యం కాబోతున్నాడు. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫజిల్ తో పాటు బోబన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇన్ని సినిమాలు చేస్తున్న ప్రెజెంట్ హోప్స్ అన్నీ ఆఫీసర్ ఆన్ డ్యూటీపైనే. మరీ అసిస్టెంట్ డైరెక్టర్ జిత్తు డైరెక్టర్ గా బోబన్ కు బ్లాక్ బస్టర్ హిట్టిస్తాడా చూడాలి.