The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది’ అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ని అభినందించారు. టీజర్‌ను గమనిస్తే.. ‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.
Also Read:NTR : అమెరికాలో షూటింగ్..కాన్సులేట్‌కు ఎన్టీఆర్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
‘ఈ మండలం మొత్తంలో బర్త్ డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే చేయించుకుంటారన్నా..’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేశారు. ‘అరే ఈ లైట్ అక్కడ పెట్టు’ అంటూ హీరోయిన్ ముందు హీరో చేసే హడావుడి.. దానికి ఆమె భయపడే తీరు, ‘ఎవండీ మీ ఫొటో తీసుకుని మా గ్యాలరీలో పెట్టుకోవచ్చా’ అని హీరోయిన్ని హీరో అడగటం.. దానికి హీరోయిన్ ‘నా ఫొటో ఎందుకు’ అని అడగటం.. దానికి సమాధానంగా హీరో ‘అంటే మీరు బావుంటారు కదా’ అని సమాధానం చెబుతాడు. దానికి హీరోయిన్ ‘ఏశావులే సోపు’ అని వ్యంగ్యంగా కౌంటర్ ఇవ్వటం వంటి డైలాగ్స్ చూస్తుంటే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండవచ్చుననే విషయం తెలుస్తుంది. ఓ సందర్భంలో హీరో ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ఒప్పుకోవటం.. పెళ్లి కూతురు తల్లి కండీషన్స్‌తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే హీరోని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు, టీజర్ చివరలో హీరో తన అసిస్టెంట్‌తో ‘ఈ డ్రెస్ బావుందారా’ అని అడిగితే ‘హీరోలా ఉన్నావన్నా’ అని అసిస్టెంట్ అంటే హీరో ఏమో షాక్ కావటం వంటి ఫన్నీ సీన్స్ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పారు మేకర్స్. తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం, కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అవుతున్నాయి. నరేష్ అడుప ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?