తాజాగా తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు అంతా హాజరు కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందించారు. ఇందులో భాగంగా ‘ఆడుజీవితం’ చిత్రానికి గాను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకున్నాడు..అంతే కాదు ఈ చిత్రం మరో తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకొని సత్తా చాటింది.
Also Read: Nazriya : పూర్తిగా కోలుకుని త్వరలోనే మీ ముందుకోస్తా..
మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్) మూవీలో సౌదీలో కూలీలు పడే కష్టాలను చూపిస్తూ.. దర్శకుడు బ్లెస్సీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. గత ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ0 ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్ళు కష్టపడి తీసిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా భారీ విజయం అందుకుంది. ఓవరాల్‌గా రూ.150 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఎంతగానో మెప్పించిన ఈ చిత్రంలో అమలా పాల్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ఇందులో జిమ్మీ జీన్-లూయిస్, రిక్ అబీ సహా ఇతరులు కీలక పాత్రలు పోషించారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మొత్తానికి పృథ్వీరాజ్ ‘ఆడు జీవితం’ చిత్రం ఇలా తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకోవడం హీరోకి ఎంతో గర్వకారణం.