Site icon NTV Telugu

The Girlfriend: గర్ల్ ఫ్రెండ్ కోసం విజయ్ దేవరకొండ..

Vijay Rashmika

Vijay Rashmika

రష్మిక మందన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులనుంచీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే, ఇందులో ఉన్న కంటెంట్ కారణంగా ఇది ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉందని విమర్శకుల అభిప్రాయం.

తాజాగా, ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యువ సంచలనం విజయ్ దేవరకొండ హాజరు కానున్నట్లు సమాచారం.

ఈ సినిమా కంటెంట్ విషయంలో మరియు రష్మిక నటన విషయంలో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, ఈ విజయ వేడుకను ఘనంగా నిర్వహించి, సినిమా విజయాన్ని మరింత మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నుంచి విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version