Site icon NTV Telugu

కిస్ సీన్స్ అనుభవం వెల్లడించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ బేబీ

The Family Man actress Ashlesha Thakur Speaks About Her Kissing Scenes

“ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌”లో మనోజ్ బాజ్‌పేయి టీనేజ్ కుమార్తెగా ధృతి పాత్రతో అష్లేషా ఠాకూర్ అందరి హృదయాలను దోచుకున్నారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ఆమె పరిణతి చెందిన నటనతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో అభయ్ వర్మతో ఆమె ముద్దు సన్నివేశం ఈ సిరీస్‌లో హైలైట్ అయిన సన్నివేశాలలో ఒకటి. అయితే ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడం సరదా కాదని 17 ఏళ్ల టీనేజర్ చెప్పుకొచ్చింది. 

Read Also : సీఎస్సార్… తీరే వేరు!

“ఈ విషయం నాకు కొత్త. చాలా నెర్వస్ గా అన్పించింది. గత సీజన్లో లాగా ఇందులో నేను చిన్నపిల్లలా కాకుండా పరిణతి చెందిన అమ్మాయిగా నటించాల్సి వచ్చింది. ఆ ముద్దు సన్నివేశం సహజంగా రావాలని నేను కోరుకున్నాను. అందుకోసం లవ్ సీన్స్ ఉన్న కొన్ని వెబ్ సిరీస్ లను నేను చూశాను. ముద్దు సన్నివేశాన్ని సాంకేతికంగానే చిత్రీకరించినప్పటికీ ఇది సరదా కాదు. ఏమైనప్పటికీ నేను నటుడిగా సౌకర్యంగా ఉండాలి. నేను నా దర్శకులను నమ్మాను. ఆ సన్నివేశం తెరపై ఎలా ఉంటుందో దాని గురించి చింతించలేదు. ఎందుకంటే వారు కథ విషయంలో ఎంత పర్ఫెక్ట్ అన్న విషయం నాకు తెలుసు” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ సన్నివేశాలను మంచి స్పందన వస్తోందట. సోషల్ మీడియాలో ఆమెకు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది. 

Exit mobile version