NTV Telugu Site icon

Priyanka : నా కూతురిని ఒంటరిగా కారవాన్ లోకి రమ్మన్నాడుః హీరోయిన్ తల్లి

Praiyanka

Praiyanka

Priyanka : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కూడా బాలీవుడ్ లో అనేక సార్లు కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎదురయ్యాయని ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక.. అటు హాలీవుడ్ లో కూడా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న భారీ సినిమాలో చేస్తోంది. అయితే ప్రియాంక కూడా కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కుందని ఆమె తల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తాను కూడా ఆమెతో పాటు సెట్స్ లో ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

Read Also: Kannppa: ‘కన్నప్ప’ ప్రేమ పాట.. ప్రీతి ముకుందన్’తో విష్ణు రొమాన్స్!

ఇక, ప్రియాంక సెట్స్ లో ఉన్నంతసేపు నేను ఆమెను కాపాడుకున్నాను. నేను ఒక దెయ్యంలా ఆమె వెంటే ఉండేదాన్ని. ఆమెకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పుకునేది. ఓ డైరెక్టర్ మా ఇద్దిరినీ కారవాన్ లోకి రమ్మన్నాడు. మేం వెళ్లాక ఓ కథ చెబుతాను అంటూ నన్ను బయటకు వెళ్లమన్నాడు. ప్రియాంకకు ఒంటరిగా కథ చెప్పాలి అన్నాడు. నేను బయటకు వెళ్లాను. కానీ ప్రియాంక ఆ సిచ్యువేషన్ ను ధీటుగా ఎదుర్కుంది. మా అమ్మ లేకుండా కథ చెబుతానంటే నేను సినిమా చేస్తానని ఎలా అనుకున్నారు అంటూ తాను కూడా వెంటనే బయటకు వచ్చేసింది’ అంటూ ప్రియాంక చోప్రా తల్లి చెప్పుకొచ్చింది.

Read Also: Crime: బీజేపీ నాయకుడి భార్య దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు

కానీ ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అప్పట్లో ప్రియాంక కూడా తాను బాలీవుడ్ లో చాలా లైంగిక వేధింపులు ఎదుర్కున్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక కూడా ఎవరి పేర్లు ఇప్పటి వరకు బయటపెట్టలేదు. ఆమె తల్లి చేసిన తాజా కామెంట్స్ తో అసలు ఆ డైరెక్టర్ ఎవరా అని ప్రియాంక ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.