ఇంగ్లీష్ లిటరేచర్ లో స్పై లేదా డిటెక్టివ్ అనగానే ‘షెర్లాక్ హోమ్స్’ గుర్తుకు వస్తాడు. అయితే, లెటెస్ట్ గా ‘బెనిడిక్ట్ కమ్బెర్ బ్యాచ్’ అదే రేంజ్లో న్యూ ఏజ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం బెనిడిక్ట్ ఖాతాలో ‘ద పవర్ ఆఫ్ ద డాగ్, ద ఎలక్ట్రికల్ లైఫ్ ఆఫ్ లూయిస్ వెయిన్, స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్, డాక్టర్ స్ట్రేంజ్’ సినిమాలున్నాయి. ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండటం మరింత విశేషం…
Read Also : సింగిల్ ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్
త్వరలో పలు చిత్రాలతో వెండితెరపై తన సత్తా చాటనున్న డిటెక్టివ్ బెనిడిక్ట్ 2020లో ‘ద కొరియర్’ మూవీతో మెస్మరైజ్ చేశాడు. అయితే, ఇప్పుడు ఆయన లాస్ట్ బిగ్ స్క్రీన్ మూవీ ఓటీటీకి రాబోతోంది. ‘ద కొరియర్’ స్పై థ్రిల్లర్ ఆగస్ట్ 2 నుంచీ అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ న్యూ క్లియర్ ప్రోగ్రామ్ లోకి చొరబడతాడు ఓ అమెరికన్ సీక్రెట్ ఏజెంట్! అతడి కథే ‘ద కొరియర్’! డోమినిక్ కూక్ ఈ స్పైయింగ్ సాగాకి సారథ్యం వహించాడు…
బెనిడిక్ట్ కమ్బెర్ బ్యాచ్ ‘ద కొరియర్’ మీరు ఇంత వరకూ చూడకపోయి ఉంటే ఆగస్ట్ 2న అమేజాన్ లో వినోదాన్ని ఆస్వాదించండి! లేదు గతంలో థియేటర్స్ లో చూసి ఉంటే… ఇప్పుడు ఇంట్లోనే ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్ తో మరోసారి థ్రిల్ ని ఎంజాయ్ చేయండి!