Site icon NTV Telugu

Dhumketu : వార్ 2, కూలీని భయపెడుతున్న బెంగాలీ సినిమా

Dhumkethu

Dhumkethu

ఆగస్టు 14న కూలీ, వార్‌2 మద్య జరిగే ఫైట్‌ని సౌత్- నార్త్ బిగ్గెస్ట్ క్లాష్‌గా చూస్తోంది సినీ ఇండస్ట్రీ. కూలీలో సీనియర్ యాక్టర్లు వార్2లో యంగ్ అండ్ డైనమిక్ హీరోలు మీ సినిమానా మా సినిమానా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎవ్వరూ ఎక్కడా తగ్గట్లేదు. ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు చేస్తున్న ప్రమోషన్స్‌ పీక్స్‌కి చేరుతున్నాయి. ఇంతటి ఫైట్‌ సిట్యుయేషన్‌లొ మరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సాహసం చేస్తుందా. కానీ మేం చేస్తాం అంటోంది ఓ బెంగాలీ ఫిల్మ్. వార్2, కూలీ చిత్రాలతో పోటీ పడుతూ ‘ధూమకేతు’ అనే బెంగాలీ ఫిల్మ్ పశ్చిమ బెంగాల్లో ఆగస్టు 14నే రిలీజ్ అవుతోంది.

Also Read : Coolie : కూలీ కోసం ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో తెలుసా?

వార్2, కూలీకి ఈ సినిమాకు ఏంటీ పొంతన అని తక్కువగా తీసిపారేయొద్దు. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే షాక్ అవ్వాల్సిందే. జనరల్‌గా నార్త్‌లో వార్2. సౌత్‌లో కూలీ సినిమాలకు ఫుల్ అటెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ బెంగాల్‌లో మాత్రం ధూమకేతుకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎంతలా అంటే ప్రీ బుకింగ్స్ సేల్స్‌లో ఈ లోకల్ సినిమాను వార్2 కూడా బీట్ చేయలేనంతలా. ధూమకేతు ఇప్పటి వరకు 21 వేల టికెట్లు అమ్ముడవగా, వార్2కి కేవలం 6 వేల టికెట్లు మాత్రమే తెగాయన్నది మార్కెట్‌ వర్గాల టాక్‌. ఇక కూలీని పెద్దగా పట్టించుకోవడం లేదు బెంగాల్ ఆడియన్స్. ఈరేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ బెంగాలీ సినిమాకి జరగలేదని అంటుయి అక్కడి మార్కెట్‌ వర్గాలు. అంతేకాదు బెంగాల్ వ్యాప్తంగా తొలి రోజే 400 ప్లస్ షోలు పడనున్నాయట. రన్నింగ్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందట. ఇంతలా హైప్ క్రియేట్ చేస్తున్న ధూమకేతు .. ఈ మధ్యలో తెరకెక్కిన ఫిల్మ్ కూడా కాదు.. ఎప్పుడో పదేళ్ల క్రితం మొదలు పెట్టి.. 8 ఏళ్ల క్రితం పూర్తైన సినిమా. పలుమార్లు రిలీజ్‌ వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పటికీ మోక్షం దక్కించుకుంది. బెంగాల్ సూపర్ స్టార్ దేవ్, శుభశ్రీ గంగూలీ సిక్త్ టైమ్ జోడీ కడుతుండటంతో బెంగాల్‌ వ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఈ ఇద్దరు గతంలో జూనియర్ ఎన్టీఆర్, సమంత, కాజల్ నటించిన బృందావనం బెంగాల్ రీమేక్ వర్షన్ ఖోకా420 వర్షన్‌లో కలిసి నటించారు. ఈ సినిమా బెంగాల్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అందుకుంది. దీంతో ఈ జంటకు హిట్‌ పెయిర్‌గా క్రేజ్ వచ్చింది. ఈ హిట్‌పెయిర్‌ ఇప్పుడు ధూమకేతుతో మరోసారి జంటగా రాబోతున్నారు. ఆగస్టు14న రిలీజ్‌ అవుతోన్న ధూమకేతు ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బెంగాల్‌లో వార్2 కలెక్షన్లకు గండిపడినట్లే అవుతుంది.

Exit mobile version