Site icon NTV Telugu

AjithKumar: పాతికేళ్ల తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట..

February 7 2025 02 19t111630.514

February 7 2025 02 19t111630.514

స్టార్ హీరో అజిత్ కుమార్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక ఇండస్ట్రీలో ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఇక అజిత్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘వాలి’ ఒకటి.. తమిళంలోనే కాక తెలుగు లోనూ బ్లక్ బాస్టర్ హిట్ అయ్యింది. దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఈ మూవీలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.ఇందులో అజిత్ బ్రదర్స్‌గా ఒక నెగటివ్ ఒక పాజిటివ్ షేడ్స్ ఉన్నరెండు క్యారెక్టర్స్‌లో అదరగోట్టాడు. సిమ్రాన్ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

Also Read:Rashmika: సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ లో కూడా శ్రీవల్లే హీరోయిన్..!

ఈ చిత్రం పాటలు మ్యూజిక్ లవర్స్‌ని ఇప్పటికి అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు అజిత్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. సిమ్రాన్ మాత్రం గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ పోతుంది.అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ జంట తిరిగి పాతికేళ్ల తర్వాత తెరపై కనిపించబోతుంది.

ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో సిమ్రాన్ కో స్పెషల్ క్యామియో ఇచ్చారట. దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు లాకైనట్టే. ఇక అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్‌కు ‘వాలి’ మూవీ ఫేవరెట్ అంటా. అందుకే ఆ కాంబోని ఈ రూపంలో అయినా రిపీట్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ ఎపిసోడ్ డిజైన్ చేశాడట. మరి ఇక సిమ్రాన్‌‌ని అజిత్ పక్కన ఎలాంటి సీన్లల్లో చూపిస్తాడో చూడాలి.

Exit mobile version