NTV Telugu Site icon

Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్

Untitled Design (63)

Untitled Design (63)

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

Also Read: Mega Star: సాయం చేయడంలోనూ ‘మెగాస్టార్’ అని నిరూపించుకున్న చిరంజీవి.. సాయం ఎంతంటే..?

ఈ కార్యక్రమంలో హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ “మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్ బంగారంలా అనిపిస్తోంది. తెలుగు సినీప్రియులు ఎంతో ప్రత్యేకం. మాకు మీ సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తంగలాన్ టీజర్, ట్రైలర్ మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నా. మీరు నా గురించి, మా తంగలాన్ సినిమా చెప్పిన ప్రోత్సాహాన్నిచ్చే మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. తంగలాన్ వందేళ్ల క్రితం జరిగిన కథ. తంగలాన్ ఒక మంచి సినిమా. ఈ స్టేజీ మీద నా సినిమాల్లోని పర్ ఫార్మెన్స్ లు చూపించారు. అవన్నీ చూసినప్పుడు ఎమోషన్ అయ్యాను. ఇవన్నీ చేశానా అనిపించింది. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే స్ఫూర్తి కలిగింది. రంజిత్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. తంగలాన్ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మీకు సర్ ప్రైజ్ గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా. మీరు థియేటర్స్ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్ తో కనెక్ట్ అవుతారు. మీరు తంగలాన్ కు చూపిస్తున్న రెస్పాన్స్ కు థ్యాంక్స్. ఈ నెల 15న థియేటర్స్ లో కలుద్దాం” అని అన్నారు

Show comments