Site icon NTV Telugu

Thammudu : ‘తమ్ముడు’ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్..

Thmmudu, Secoand Song

Thmmudu, Secoand Song

నితిన్ హీరోగా, దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తుండగా. ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక చిత్ర బృందం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్స్‌ను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని అంతకంతకూ పెంచుతోంది. ఇప్పటినే ఫస్ట్ సింగిల్ ఇంకా ట్రైలర్ విడుదల కాగా, తాజాగాఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘జై బగళాముఖీ’ అనే పాట విడుదల చేశారు.

Also Read : Thammudu : ‘త‌మ్ముడు’ మూవీలో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన చిన్నారి ఎవరో తెలుసా..!

ఇక ఈ సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అనడంలో సందేహం లేదు. “జై బగళాముఖీ” అనే మంత్రోచ్ఛారణల నేపథ్యంలో సాగిన ఈ పాటలో ఉన్న భక్తి భావం, సినిమాకు డివోషనల్ టచ్‌ను కూడా అందిస్తోంది. ఈ పాటలోని విజువల్స్, బ్యాగ్రౌండ్ సీన్స్‌ కూడా ఆధ్యాత్మికతను దృష్టిలో ఉంచుకుని భారీగా తెరకెక్కించ పడ్డాయి. గాయకుడు అబ్బి వి తన అద్భుతమైన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. వింటున్నప్పుడే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఇక, ఈ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అందించిన సాహిత్యం, మరింత ప్రభావవంతంగా ఉండటంతో, పాట కేవలం సంగీత పరంగా కాకుండా, భావపరంగా‌ను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాట విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇది వరకు ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నా.. ఇప్పుడు ‘జై బగళాముఖీ’ సాంగ్ మాత్రం సినిమా క్రేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది అనడంలో సందేహం లేదు.

Exit mobile version