Site icon NTV Telugu

Thammudu : ‘త‌మ్ముడు’ మూవీలో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన చిన్నారి ఎవరో తెలుసా..!

Nithin Thammudu

Nithin Thammudu

మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హారోలో నితిన్ ఒకరు. ఒక‌ప్పుడు మంచి విజ‌యాల‌తో ప్రేక్షకుల‌ని ఎంత‌గానో థ్రిల్ చేసిన ఆయనకు ఈ మ‌ధ్య స‌రైన స‌క్సెస్‌లు కరువయ్యాయి. చివ‌రిగా వ‌చ్చిన ‘రాబిన్ హుడ్’ కూడా బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు అనో ఆశలతో ‘త‌మ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది.

Also Read : S.S Rajamouli : డెత్ స్ట్రాండింగ్ 2లో.. ఎస్.ఎస్. రాజమౌళి

ఇక ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుంది. లయ ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్రలో క‌నిపించ‌నుంది. ఇక‌ లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తుంది. ఆ పాప ఈ మూవీలో కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్ లో నితిన్ పక్కనే కనిపించింది. దీంతో ఈ సినిమాలో నితిన్‌కి మేనకోడలుగా నటిస్తున్న పాప ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. అయితే ఆ పాప‌ పేరు దీత్య ఈ పాప ఎవరో కాదు ‘తమ్ముడు’ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూతుర్నే అంటా. ఈ సినిమాతో తన కూతురు దీత్యని నటింప చేస్తున్నారు. దీత్య కూడా ప్రమోషన్స్ లో పాల్గొని తన క్యూట్ క్యూట్ మాటలతో అంద‌రిని అల‌రిస్తుంది. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కూడా పాల్గొంటుంది.ఈ సినిమా తర్వాత కూడా దీత్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.

Exit mobile version