Site icon NTV Telugu

Dil Raju: రివ్యూస్ రాసేప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి!

Dilraju

Dilraju

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న “తమ్ముడు” ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.

Also Read : Dil Raju: దిల్ రాజు కాంపౌండ్ నుంచి రానున్న సినిమాలివే!

ముఖ్యంగా ఆయన సినిమా రివ్యూస్ గురించి మాట్లాడారు. పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్ తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్ కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్ కే అని ఆయన అన్నారు. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు.

Also Read : War 2: హృతిక్, ఎన్టీఆర్‌లతో విడివిడిగా ప్రమోషన్స్?

నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్ కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్ గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్ తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్ గా చూడొద్దు.

Exit mobile version