Danayya : ఓజీ టైటిల్ నాగవంశీదే.. ఇచ్చినందుకు థాంక్స్!
- మూవీకి పాజిటివ్ టాక్
- టైటిల్ బాగావెళ్లింది
- దానయ్య కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danayya : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ క్రమంలో నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. “ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. నేను మొట్ట మొదటిగా థాంక్స్ చెప్పాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. దర్శకుడు సుజీత్ పేరు త్రివిక్రమ్ సూచించారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాం. సుజీత్ తో రెండున్నరేళ్ళకు పైగా ప్రయాణం చేశాను.
ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎన్నో రోజులు నిద్ర కూడా మానుకొని ఈ చిత్రం కోసం పనిచేశాడు. సుజీత్ చెప్పినట్టు.. తమన్, నవీన్ నూలి, రవి చంద్రన్ గారు ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు. వీళ్ళు కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా సినిమా కోసం కష్టపడ్డారు. ఓజీ బ్లాక్ బస్టర్ అవుతుందని తమన్ నమ్మకంగా చెప్పేవాడు. ఇప్పుడు అభిమానుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్, యాక్షన్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ఏఎస్ ప్రకాష్ గారి ఆర్ట్ వర్క్ బాగుంది. డైరెక్షన్ డిపార్ట్ మెంట్, మా మేనేజర్స్ చేసిన కృషిని మరిచిపోలేను. అలాగే నాగవంశీ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. నిజానికి ఓజీ అనే టైటిల్ ను ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, మా కోసం ఆ టైటిల్ ఇచ్చేశారు. ఓజీ టైటిల్ సినిమాకి ఎంతో హెల్ప్ అయింది. విడుదలకు ముందు అభిమానులు ‘ఓజీ ఓజీ’ అంటూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. ఇప్పుడు సినిమా విడుదలై, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!