టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “అతి త్వరలో అప్డేట్ వస్తుంది. సిద్ధంగా ఉండండి… ఆగష్టు వరకు వెయిట్ చేయలేను” అంటూ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఆ అప్డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినేమా నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
Read Also : “రామారావు” కోసం ఆన్ డ్యూటీలో మరో హీరో
మరోవైపు తమన్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలకు స్వరాలు సమకూరుస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. దాదాపు అన్ని పెద్ద సినిమాలకు తమన్ నాన్ స్టాప్ గా పని చేస్తున్నారు. “సర్కారు వారి పాట”తో పాటు “ఆర్సి15”, చిరంజీవి, మోహన్ రాజా మూవీ “లూసిఫర్” రీమేక్, “అఖండ”, పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.