NTV Telugu Site icon

Thalapathy Vijay: విడాకులకు సిద్ధమైన విజయ్.. కారణం కీర్తి సురేశ్?

Vijay Divorce Case

Vijay Divorce Case

Thalapathy Vijay Ready For Divorce With Sangeetha For Keerthy Suresh: తమిళ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నాడా? అంటే, అవుననే కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తమ 22 ఏళ్ల పెళ్లి బంధానికి విజయ్ ఫుల్ స్టాప్ పెట్టనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈమధ్య విజయ్‌కి సంబంధించిన ఈవెంట్లలోనూ సంగీత ఎక్కడ కనిపించకపోవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికిప్పుడు విజయ్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం.. నటి కీర్తి సురేశ్ అని తమిళ వీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతకాలం నుంచి విజయ్, కీర్తి మధ్య ప్రేమాయణం సాగుతోందని.. ఈ క్రమంలోనే విజయ్ విడాకులకి సిద్ధం అయ్యాడని టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan: బీజేపీతోనే ఉన్నా.. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా

గతంలో విజయ్, కీర్తి కలిసి ‘భైరవ’, ‘సర్కార్’ సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారిందట! అప్పటినుంచి వీళ్లిద్దరు సాన్నిహిత్యంగా మెలుగుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన సంగీత.. కీర్తికి దూరంగా ఉండాలని విజయ్‌కి చాలాసార్లు చెప్పిందని, కానీ అతడు తన భార్య మాటల్ని పెడచెవిన పెట్టి కీర్తితో క్లోజ్‌గా ఉంటున్నాడని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్లు మరింత క్లోజ్‌గా మెలుగుతున్న తరుణంలో.. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలోనే తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు విజయ్ రెడీ అవుతున్నాడని వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సానియా-బోపన్న జోడీ

దీంతో.. విజయ్ భార్య సంగీతకు మద్దతుగా అభిమానులు రంగంలోకి దిగారు. సంగీతకు న్యాయం చేయాలంటూ.. సోషల్ మీడియాలో #JusticeForSangeetha హ్యాష్‌ట్యాగ్‌తో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇదే సమయంలో.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావంటూ కీర్తి సురేశ్‌ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై విజయ్ గానీ, సంగీత గానీ, కీర్తి గానీ ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు.. వారిసు హిట్ చూసి కొందరు ఓర్వలేక, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తెరమీదకి తీసుకొచ్చారంటూ విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ మేటర్‌లో కీర్తిని అనవసరంగా లాగుతున్నారని మండిపడుతున్నారు. మరి, ఏది నిజమో తెలాలంటే, ఎవరో ఒకరు స్పందించేవరకు వేచి చూడాలి.

Tiger Fear: వణికిస్తున్న పెద్ద పులి.. అర్థవీడు మండలంలో భయం భయం

Show comments