స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఒక సరికొత్త కథ, కథాంశంతో తెలుసు కదా వస్తున్నట్టు యూనిట్ చెప్తూ వస్తోంది.
Also Read : OG : ఓజి సినిమా చూస్తున్న ప్రేక్షకులపై పడిన స్పీకర్.. ఇద్దరి ఫ్యాన్స్ కు తీవ్రగాయాలు.
తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాశి కన్నా, సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా దట్టించారు. పోటా పోటీగా అందాలు ఆరబోశారు రాసి, శ్రీనిధి. ఈ చిత్రం నుండి రిలీజ్ అయినా మల్లిక గంధ ఫస్ట్ లిరికల్ సాంగ్ కు చాట్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 22 కోట్లకు తెలుసుకదా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది. జాక్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ సినిమాకు అంత ధర పలికిందంటే సూపర్ డీల్ అనే చెప్పాలి. ఓటీటీ రూపంలో నిర్మాతకి జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న తెలుసు కదా ఈ ఏడాది అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో రిలీజ్ కానుంది.