Site icon NTV Telugu

Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఇంటర్నల్ కమిటీ!

Tollywood

Tollywood

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో కూడిన ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి సమానంగా ప్రాతినిధ్యం వహించే సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.

Also Read:Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా?

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కమిటీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఇక ఈ కమిటీలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది సభ్యులుగా దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్, సి. కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఎంపికయ్యారు.

Also Read:కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?

డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం. సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. సినీ పరిశ్రమలోని ప్రస్తుత సమస్యలను విశ్లేషించి, సమర్థవంతమైన పరిష్కారాలను సూచించేందుకు ఈ కమిటీ కృషి చేయనుందని అంటున్నారు.

Exit mobile version