Site icon NTV Telugu

Srinivasaa Chitturi: టాలీవుడ్ నిర్మాత ఇంట విషాదం

Chitturi

Chitturi

తెలుగు సినీ నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు అలియాస్ చిట్టూరి శ్రీనివాస నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. చిట్టూరి శ్రీనివాస యూ టర్న్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత స్కంద, కస్టడీ, సిటీమార్, బ్లాక్ రోజ్ వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఆ సినిమాలు ఆడకపోయినా నాగార్జునతో చేసిన నా సామి రంగా సినిమా మాత్రం హిట్ అవడంతో ప్రస్తుతానికి మరిన్ని సినిమాలు చేస్తున్నారు.

ALso Read:War 2: సినిమా అంతా ఎన్టీఆర్ ఉంటాడు!

అయితే ఆయన ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు సోదరుడు చిత్తూరి కాశీవిశ్వనాథ్ (49) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఇవాళ ఉదయం ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం పసివేదలలో కన్నుమూశారు.

Exit mobile version