తమకు వేతనాలు పెంచాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తరపున అన్ని యూనియన్ నాయకులు తెలుగు సినీ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలివిగా బంద్ అని ప్రకటించకుండా వేతనాలు పెంచిన వారి షూటింగ్స్‌కి మాత్రమే వెళతామని వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం సరికాదని లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లిన ఫిల్మ్ ఛాంబర్ సహా నిర్మాతల మండలి సభ్యులు ఇప్పటికే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు చిరంజీవితో భేటీ కానున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికి ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు.
Also Read:Daddy Movie: ‘డాడీ’లో చిరంజీవి కూతురు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
ఆయన ఆ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడకపోయినా సినీ పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరికి చిరంజీవి ప్రమేయంతోనే క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ అంశాన్ని చిరంజీవి ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేతనాల పెంపుకు ఏ మాత్రం సుముఖంగా లేని నిర్మాతలు కొత్తగా 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసేందుకు అప్లికేషన్లు పంపాల్సిందిగా గిల్డ్ తరఫున ఒక వెబ్‌సైట్ ప్రారంభించారు. అదేవిధంగా ఒక మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఇక ఈ రోజు సాయంత్రం చిరంజీవిని కలిసి అసలు జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారని నిర్మాతలు. ఆ తర్వాత ఎలాంటి ప్రకటన వెలువడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
