తెలుగు సినీ నటుడు అలీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన రాజమండ్రికి చెందినవాడని, చిన్నప్పుడే సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లి, అక్కడ సినిమా నటుడిగా మారాడని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే, అలీ పూర్వీకులది బర్మా(నేటి మయన్మార్ రాజధాని). ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిజానికి, అలీ నానమ్మ, తాత, అలీ తండ్రితో, అలాగే నానమ్మ తమ్ముడితో కలిసి సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఒక షిప్ ఎక్కి బర్మా నుంచి బయలుదేరి భారతదేశానికి చేరారట.
Also Read:Balmuri Venkat : కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్.. చర్చకు సిద్ధమా..?
మొత్తం నలుగురిగా రాజమండ్రి వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత కేవలం ఈ కుటుంబమే వృద్ధి చెంది, ఇప్పుడు వెయ్యి మందికి పైగా బంధువులు ఏర్పడినట్లు అలీ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అలీ నటుడిగా కొన్ని వందల సినిమాలు చేశారు. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు ఆయన నిర్మించారు. అయితే, ఆయన తెలుగువాడే అయినా, మూలాలు మాత్రం బర్మాతో ఉండటం ఆసక్తికరం.
