Site icon NTV Telugu

MIRAI : తేజ సజ్జా ‘మిరాయ్’కు బాలీవుడ్ నిర్మాత భారీ డీల్

Mirai

Mirai

చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు, ఇటు హీరో తేజాకు నార్త్ బెల్ట్‌లో మాంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో బిజీ కాగా, తేజ సజ్జా నెక్ట్స్ మరో పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయ్‌ను రెడీ చేస్తున్నాడు.

Also Read : HHVM : అక్కడ అల్ట్రా డిజాస్టర్ దిశగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ బొమ్మపై ఎక్స్‌పెక్టేషన్స్‌ స్కైని తాకేలా ఉన్నాయి. ఏప్రిల్ 18నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వీఎఎక్స్, కొంత షూటింగ్ పెండింగ్ వల్ల సెప్టెంబర్ 5కి రిలీజ్ విడుదల కాబోతుంది. మిరాయ్ కు బాలీవుడ్‌లోనూ జాక్ పాట్ తగిలింది. ఈ సినిమా నార్త్ హక్కుల కోసం బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ రంగంలోకి దిగాడు. ఇప్పటికే బాహుబలి, దేవరలాంటి చిత్రాలతో ప్రాఫిట్ చూసిన కరణ్ జోహార్ మిరాయ్ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో భారీ డీల్ చేసుకున్నాడు. ఈ డీల్ తో బాలీవుడ్‌లో తేజా సజ్జా మిరాయ్‌కు వేరే లెవల్ అటెన్షన్ క్రియేట్ కావడమే కాదు  బాక్సాఫీస్ లెక్కలు కూడా మారే ఛాన్స్ ఉంది. అటు  మార్కెట్ పరంగా మరింత పెద్ద సినిమాగా మారుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎంతైనా తేజ సజ్జా సుడిగాడే.

Exit mobile version