Site icon NTV Telugu

Teja Sajja : ఈ ఇద్దరు స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా డ్రీమ్: తేజా సజ్జా

Teja Sajja

Teja Sajja

టాలీవుడ్‌లో కొత్త తరహా కథలతో, విభిన్నమైన పాత్రలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో తేజ సజ్జా. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన తేజా, ఇటీవల భారీ విజయాన్ని సాధించిన హనుమాన్ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు మరో భారీ విజువల్ ఎంటర్టైనర్ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, డ్రీమ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Also Read  : Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ 3 అవార్డ్స్.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్

తేజా మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండి అనేక మంది స్టార్ హీరోలతో పని చేశాను. కానీ ఇప్పుడు ఒక యంగ్ హీరోగా మళ్లీ వారితో కలిసి నటించే అవకాశం రావాలని ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారు, వెంకటేష్ గారితో కలిసి స్క్రీన్ పంచుకోవడం నా డ్రీమ్. వాళ్ల కామెడీ టైమింగ్, హ్యూమర్ ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పుడూ అల్టిమేట్‌గా ఉంటాయి. అలాంటి సీన్లలో నేను వారితో కలిసి నటిస్తే.. అది నాకు లైఫ్‌టైమ్ మెమరీ అవుతుంది. కామెడీ సీన్లలో నటించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. చిరంజీవి గారి టైమింగ్‌కి సాటిలేదు. వెంకీ గారి న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ మరీ అద్భుతంగా ఉంటాయి. వారితో కలిసి నటించే అవకాశమే వస్తే అదే నాకు పెద్ద అదృష్టం ” అని భావోద్వేగంగా చెప్పాడు.

తన రాబోయే చిత్రం మిరాయ్ గురించి మాట్లాడుతూ, తేజా “ఈ సినిమాలో ఎలాంటి బాడీ డబుల్స్ వాడలేదు. రిస్క్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా నేను స్వయంగా చేశాను. ఆ యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమా కోసం నేను చేసిన కష్టానికి ఫలితం రాబోతుందని నమ్ముతున్నాను. రిలీజ్ కోసం చాలా ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నాను” అని తెలిపాడు.

Exit mobile version