NTV Telugu Site icon

SDT18: సాయి దుర్గ్ తేజ్18 బర్త్ డే గ్లింప్స్ అదరహో..

Sdt18

Sdt18

సుప్రీమ్ హీరో సాయిదుర్గతేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.గతేడాది ఏప్రిల్ లో విడుదలై ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి తేజ్. కథ ప్రాముఖ్యం ఉన్నసినిమాలు చేయాలన్నా ఉద్దేశంతో ఆచి తూచి సినిమాలు ఒకే చేస్తున్నాడు. అలా నూతన దర్శకుడు రోహిత్‌ కేపీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. #SDT18 గా రానున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దదాపు రూ. 120 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మేకర్స్.

Also Read : Prince : ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ “కలి”

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి నేడు చిత్ర హీరో సాయి దుర్గ్ తేజ్ పుట్టిన రోజు కానుకగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించారు. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్ గా నిలిచాయి.  హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్ ను ఒక షాట్ లో చూపించారు. ఇక వీడియో చివర్లో నిప్పు కణికలు మధ్య చేతికి ఆయుధం ధరించి ఉన్న  సాయి దుర్గ్ తేజ్ సీన్ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉందని చెప్పక తప్పదు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం  సరికొత్త మేకోవర్ లోకి మారాడు సాయి.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.