Site icon NTV Telugu

Taraka Rama Rao: పూజా కార్యక్రమాలతో మొదలైన తారక రామారావు సినిమా

Taraka Rama Rao,

Taraka Rama Rao,

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు వైవిఎస్ చౌదరి. నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరితో పాటు లోకేశ్వరి, పురంధేశ్వరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే..

Also Read : Rajinikanth : హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకున్న రజినీకాంత్..

ఇది 1980 నేపథ్యంలో సాగే స్టోరీ అంటా. తెలుగు భాషకు పెద్దపీట వేస్తూ.. హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ఈ మూవీలో చూపించనున్నట్లు వై.వి.ఎస్ చౌదరి తెలిపారు. అలాగే ఈ మూవీకి నేపథ్యమే బలమని తెలిపారు. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకొంది. ఎంత సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చేటప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే అంత ఈజీ కాదు. చాలా కష్ట పడాలి. మరి తారక రామారావు ఎంత వరకు గుర్తింపు చేసుకుంటారో చూడాలి.

Exit mobile version