NTV Telugu Site icon

NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?

Ntrneel

Ntrneel

దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 50 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. అదే జోష్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే.

Also Read : Mokshagna : సింబా ఈజ్ కమింగ్.. పూజా కార్యక్రమం ఎప్పుడంటే..?

ఓ నెల క్రితం ఆ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ముగించారు మేకర్స్. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించేసారు మేకర్స్. తాజగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్ తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ పోస్టర్ రానున్నసంక్రాంతికి విడుదల చేస్తారట. జనవరి నుండి ఒకవైపు వార్ -2 షూటింగ్ లో పాల్గొంటూనే నీల్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు తారక్. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అని ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ టైటిల్ నే అఫీషియల్ గా ప్రకటిస్తారని తెలుస్తోంది. రవి  బస్రూర్ సంగీతంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనుంది యూనిట్.

Show comments