Site icon NTV Telugu

Tanu Radhe Nenu Madhu : ఆర్.పి.పట్నాయక్ డైరెక్షన్, యాంకర్ గీతా భగత్ ప్రొడ్యూసర్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్!

Kadha Sudha

Kadha Sudha

కుటుంబమంతా కలిసి చూడదగ్గ కంటెంట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది ఈటీవీ విన్ సంస్థ. ‘కథా సుధ’ పేరుతో వారానికో షార్ట్ మూవీని విడుదల చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. దీనిలో భాగంగా ‘తను రాధే.. నేను మధు’ అనే కొత్త ఎపిసోడ్ ను విడుదల చేసింది. 33 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ మూవీ సెప్టెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్.పి.పట్నాయక్ ఈ ‘తను రాధే.. నేను మధు’ని డైరెక్ట్ చేయగా యాంకర్ గీతా భగత్ ‘తను రాధే.. నేను మధు’ తో నిర్మాతగా మారడం మరో విశేషం.

Also Read:Rajni – Kamal : రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా నుండి లోకేష్ కనకరాజ్ అవుట్..

లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించిన ఈ షార్ట్ మూవీలో ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. విదేశాల్లో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారం చేసుకుని ఈ షార్ట్ మూవీని తెరకెక్కించారు ఆర్.పి. స్వచ్ఛమైన ప్రేమలో నమ్మకం, సహనం,భావోద్వేగం వంటివి ఉంటాయని…వాటి లోతుని 33 నిమిషాల్లో తెలియజేస్తూ చాలా సెన్సిబుల్ గా ఈ షార్ట్ మూవీని రూపొందించారు. క్లైమాక్స్ అయితే అందరినీ భావోద్వేగానికి గురి చేసే విధంగా డిజైన్ చేశారు. రఘురాం బొలిశెట్టితో కలిసి ఈ షార్ట్ మూవీని నిర్మించారు గీతా భగత్. షూట్ అంతా అమెరికాలోనే జరిగింది.

Exit mobile version