Sathyan Sivakumar: సినీ ఇండస్ట్రీ మెరిసే ప్రపంచం. బయటకు ఎంతో గ్లామరస్‌గా, జాలీగా కనిపించినా, లోలోపల మాత్రం ఎన్నో విషాదాలు ఉంటాయి. సక్సెస్ వస్తే స్టార్, వరసగా ఫెయిల్యూర్ ఎదురైతే అంతే సంగతి. ఇలా చాలా మంది జీవితాలు తలకిందులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క తప్పటడుగు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రముఖ తమిళ సినీ నటుడు, తెలుగు వారికి కూడా సుపరిచితం అయిన సత్యన్ శివకుమార్‌ది కూడా ఇదే పరిస్థితి. ‘‘కుట్టి రాజా’’గా పిలుచుకునే భూస్వామి కుమారుడైన ఈయన, సినిమాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. 500 ఎకరాలకు వారసుడు, రాజా మహల్‌ని తలపించే భవనం కలిగిన సత్యన్, చివరకు తన విలాసవంతమైన ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది.
సత్యన్ శివకుమార్ తమిళ సినిమాల్లో సహాయ పాత్రల్లో నటుడిగా గుర్తింపు పొందాడు. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన నంబన్, (తెలుగులో స్నేహితుడు) సినిమాతో గుర్తింపు పొందాడు. తమిళ స్టార్ విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో చాలా నవ్వించారు. మురగదాస్ డైరెక్షన్‌లో విజయ్ హీరోగా వచ్చిన ‘‘తుపాకీ’’ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా నటించి మెప్పించారు. ఈ రెండు సినిమాలతో అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also: Tomato Prices Fall: భారీగా పడిపోయిన టమోటా రేటు.. రైతన్నకు తీవ్ర నష్టం..
సత్యన్ తండ్రి మాధంపట్టి శివకుమార్ భూస్వామి, చాలా ధనవంతుడు. చిన్నప్పటి నుంచి సత్యన్ కూడా ఒక రాజరిక హోదాలో పెరిగారు. 500 ఎకరాలకు పైగా భూమితో పాటు 5 ఎకరాల్లో అద్భుతమైన బంగ్లా ఉండేది. శివకుమార్‌కి రాజు లాంటి హోదా ఉండేది. దీంతో సత్యన్ ‘‘కుట్టి రాజా’’ అనే బిరుదు పొందారు.
సత్యన్ సినిమాల పట్ల ఆసక్తి పెంచుకోవడంతో అతడి తండ్రి కూడా కాదనలేకపోయారు. మొదట్లో తన బంధువులు, ఇతర నటుల నుంచి ప్రోత్సాహం లభఇంచింది. దీంతో స్వయంగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. సత్యన్ తన మొదటి సినిమా ‘‘ఇలైయవాన్’’ను నిర్మించారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీనిలో పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరైంది. ఇది కుటుంబంపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. ఆ తర్వాత స్యన్ తండ్రి మరణించాడు. ఇది ఆర్థిక నష్టంతో పాటు సత్యన్‌ని మానసికంగా కుంగదీసింది.
