‘తగ్గేదే లే’ అంటున్న తమన్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. మోహన్ బాబు తనయుడు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా… నిజానికి ఇంతకాలం స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. పాలబుగ్గల ఈ చిన్నారి… వచ్చినంత వేగంగా వెళ్ళిపోతుందనే అనుకున్నారు. కానీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే తమన్నా… నిదానంగా తన నట జీవితాన్ని పద్ధతి ప్రకారం విస్తరింపచేస్తూ, అంకిత భావంతో అనుకున్నది సాధిస్తూ ముందుకు కదిలింది. తమన్నాలో ఉన్న గొప్ప విశేషం ఏమంటే… ఏ రోజూ తానో స్టార్ హీరోయిన్ అనే భావనే మనసులోకి తెచ్చుకోదు. ఎవరు ఏమి చెప్పినా ఆలకిస్తుంది. దర్శక నిర్మాతలు అందుకే తమన్నాను మళ్ళీ మళ్ళీ ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే వెబ్ సీరిస్ లోకి అడుగుపెట్టిన తమన్నా… ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సినిమాల్లోనూ నటిస్తోంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాస్ట్రో మూవీ గురించి. హిందీ అంథాధున్లో టాబు పోషించిన పాత్రను ఇక్కడ తెలుగులో తమన్నా చేస్తోందని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. తమన్నాకు అలాంటి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. కానీ తమన్నా మాత్రం తన ఇమేజ్ ను భిన్నమైన పాత్రను ఎంపిక చేసుకుని నటిగా సత్తా చాటాలని తహతహలాడుతోంది. ఇదే తెగింపు ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా చేసేట్టుగానే ఉంది. దానికి తాజా ఉదాహరణ తమన్నా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కోసం కుకింగ్ షో కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ‘మాస్టర్ షెఫ్’ తరహాలో సాగే ఈ కార్యక్రమం తమన్నాకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. విశేషం ఏమంటే… తమన్నా ఇక్కడ చేయబోతున్న ఈ టీవీ షో కన్నడలో కచ్చా సుదీప్ చేయబోతున్నాడట. అక్కడ మేల్ స్టార్ ను ఎంపిక చేసుకున్న కార్యక్రమ నిర్వాహకులు ఇక్కడ మాత్రం తమన్నా పైపు మొగ్గు చూపారంటే ఆమె రేంజ్ ను అర్థం చేసుకోవచ్చు!
Also Read
తాజావార్తలు
-
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
-
AP Elections: పల్లె పోరుకు సిద్ధం.. రేపటి నుంచి నామినేషన్లు, 26న ఓట్ల లెక్కింపు..
-
Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
-
Best Business Idea: ఐటీ ఉద్యోగాలు వదిలి రూ. 56 లక్షల బిజినెస్.. ఐడియా అదిరిపోయిందిగా..
-
Anirudh Kavya Marriage: తాళి కూడా కట్టలేదు కానీ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లు!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!