Site icon NTV Telugu

Tamannaah : సె** స్వచ్ఛమైన.. పవిత్రమైన కార్యం.. తప్పుగా చూడ‌డం మానుకోండి

Tamannah

Tamannah

ప్రజంట్ హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా నటిస్తున్నారు. ముఖ్యంగా పాత్రలకు ప్రాధాన్యత ఉంటే చాలు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇందులో తమన్నా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంది. ప్రజంట్ సినిమాలు, సిరీస్ .. స్పెషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కెరీర్ లో అప్స్ అండ్ డౌన్‌లు కామన్ కానీ.. తమన్నా మాత్రం ఎక్కడ తగ్గకుండా కెరీర్ పడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది. చివరికి స్కీన్ షో కూడా పెంచేసి.. మరింత ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

Also Read : B-Unique Crew : ‘పుష్ప’ సాంగ్‌తో అమెరికా స్టేజ్‌ కంపించేశాడు ‘బీ యూనిక్‌ క్రూ’..

బాహుబలి సినిమాలో అవంతిక పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశం గురించి దర్శకుడు ఎస్ ఎస్. రాజమౌళి తనతో ఎలా వివరించారో తమన్నా గుర్తు చేస్తూ ఇలా అన్నారు.. ‘రాజమౌళి సార్ నాకు చెప్పారు, ‘అవంతిక ఒక దేవత లాంటి స్త్రీ. లోపల అనేక బాధలు ఎదుర్కొన్నది. స్త్రీ తత్వం తో నిండిన, ప్రేమించాలనుకునే ఒక నాజూకైన మనిషి. కానీ గతంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వదు. ప్రజలు తనను దుర్వినియోగం చేస్తారన్న భయంతో తన చుట్టూ తానే గోడలు కట్టుకుంటుంది. కానీ ఒక అబ్బాయి వస్తాడు. అతను ఆమెకి తన అందం, ఆత్మవిశ్వాసం గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు’ అని.. అందుకే ఆ పాత్రలో లీనం అయిపోయా. కానీ పచ్చబోటు సాంగ్ చేశాకా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నాకు. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. సె** అనేది శుద్ధమైన, పవిత్రమైన విషయం. దాన్ని మనం చెడ్డగా చూడ‌డం మానుకోవాలి. జనాలు మిమ్మల్ని అలాంటి సీన్స్ లో చూసినప్పుడు చీ అంటారు . అది సృష్టి ధర్మం అని మర్చిపోతున్నారు. మనం ఈరోజు ఇక్కడ ఉండటం దీనివల్లే. అయినా అది బహిరంగంగా మాట్లాడ లేనంత చెడు విషయం ఎలా అవుతుంది?’ అంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో తమన్నా మాటలు బాగా వైరల్ అయిపోతున్నాయి.

 

Exit mobile version