NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ రక్తంతో తడిసి, 8 ఏళ్ల కొడుకుతో సింహంలా నడుచుకుంటూ వచ్చాడు!

Saif Ali Khan

Saif Ali Khan

జనవరి 15 అర్థరాత్రి నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌న్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే సైఫ్ అలీఖాన్‌ను ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లిందెవరన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పెద్ద కొడుకు ఇబ్రహీం అర్ధరాత్రి సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడని వేర్వేరు నివేదికలలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరో సమాచారం వస్తోంది. తైమూర్‌తో పాటు సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీఖాన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, సైఫ్ అలీ ఖాన్ తన 8 ఏళ్ల కొడుకు తైమూర్ అలీ ఖాన్‌తో కలిసి ఆటో రిక్షాలో ఆసుపత్రికి చేరుకున్నారని డాక్టర్ చెప్పారు.

Shobita: కల? నిజమా?.. శోభితా అక్కినేని పోస్ట్ వైరల్

డాక్టర్ మాట్లాడుతూ, “సైఫ్ అలీఖాన్ ఆసుపత్రికి వచ్చినప్పుడు, మొదట అతన్ని కలిసిన డాక్టర్ నేనే. సైఫ్ రక్తంతో తడిసిపోయాడు, కానీ సింహంలా నడుచుకుంటూ వచ్చాడు. అతనితో పాటు అతని చిన్న కుమారుడు తైమూర్ కూడా ఉన్నాడు. సైఫ్ అలీఖాన్ పరిస్థితి మెరుగ్గా ఉంది, మరోవైపు దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడంలో పోలీసులు కూడా బిజీగా ఉన్నారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు 20 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. ఈరోజు ఒక అనుమానితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు, అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, అనుమానిత దాడికి పాల్పడిన వ్యక్తినా లేక మరెవరో అనే విషయం మాత్రం తెలియరాలేదు. సైఫ్ వెన్నెముక, మెడకు శస్త్రచికిత్స జరిగింది. సైఫ్ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు.