NTV Telugu Site icon

Allu vs Mega : అల్లు అర్జున్ నువ్ పుడింగివా? మీ నాన్ననే గెలిపించుకోలేక పోయావ్.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Bolisetty Srinivas

Bolisetty Srinivas

Tadepalligudem MLA Bolisetti Srinivas Sensational Comments on Allu Arjun: అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన పోటీలో ఉన్న సమయంలో జనసేన- టిడిపి- బిజెపి కూటమికి ఆపోజిట్ లో ఉన్న వైసిపి ఎమ్మెల్యే ఒకరికి అల్లు అర్జున్ మద్దతు పలికారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు. అప్పటినుంచి ఒక రకంగా సోషల్ మీడియాలో అల్లు ఫాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ అంశం మీద అనేకమంది స్పందించారు. అటు మెగా ఫ్యామిలీ నుంచి ఇటు అల్లూ ఫ్యామిలీ నుంచి కూడా పలు సందర్భాలలో స్పందించి పరిస్థితి చల్లబరిచే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా జనసేన ఎమ్మెల్యే ఒకరు అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Bijili Ramesh: తాగుడుకు బానిసై నటుడు మృతి

తాడేపల్లిగూడెంకి చెందిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను ఈ అంశం మీద స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధి ఒకరు కోరారు. దీంతో ఆయన స్పందిస్తూ అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారా? ఆ సంగతి నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి విడిపోయి వచ్చిన వ్యక్తులు బ్రాంచీలుగాని షామియానా కంపెనీలు లాగా ఏమైనా పెట్టుకుంటే మాకు తెలియదు. కానీ ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ. అంతేతప్ప అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు.

ఆయన ఊహించుకుంటున్నాడు ఏమో ఉన్నారని, ఆయన స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి గారి అభిమానులు అందరూ నీలో చిరంజీవి గారిని చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ ను చూసుకుంటున్నారు, రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ ను చూసుకుంటున్నారు ఆయన్ని కాదు నేను పెద్ద పుడింగిని నాకు ఇష్టమైతేనే వస్తా అంటే మానేసి వెళ్ళిపో. ఎవడికి కావాలి? నిన్నేమైనా రమ్మని అడిగామా? నువ్వు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? 21 చోట్ల నిలబడితే 21 నెగ్గాం మేము . నువ్వు వెళ్లిన ఒక్క సీటు కూడా ఓడిపోయింది. మీ నాన్న ఎంపీగా నిలబెడితే నువ్వు నెగ్గించలేదు నువ్వు, అందరినీ విమర్శించడం మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నాను అంటూ ఆయన కామెంట్ చేశారు.

Show comments