NTV Telugu Site icon

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ `హ‌సీన్ దిల్ రుబా`

Taapsee Pannu's 'Haseen Dilruba' Now Streaming on Netflix

గ‌త యేడాది ఫిబ్ర‌వ‌రిలో తాప్సీ పన్ను న‌టించిన త‌ప్ప‌డ్ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇన్ స్టెంట్ గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఆ సినిమాను మే నెల‌లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. తాజాగా తాప్సీ న‌టించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సినిమా నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. తాప్సీ, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణే, విక్రాంత్ మెస్సీ ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషించిన మూవీ హ‌సీన్ దిల్ రుబా. సినిమా ప్రారంభ‌మై కావ‌డంతోనే యువ‌త దృష్టి ఈ మూవీ మీద ప‌డింది. రొటీన్ కు భిన్నంగా ఉండ‌బోతోంద‌ని స్టార్ కాస్ట్ బ‌ట్టి మూవీ ల‌వ‌ర్స్ భావిస్తున్నారు. జులై 2న నెట్ ఫ్లిక్స్ లో దీనిని స్ట్రీమింగ్ చేస్తున్నామ‌ని తెలియ‌చేస్తూ చిత్ర బృందం ఓ న‌యా పోస్ట‌ర్ ను సోమ‌వారం విడుద‌ల చేసింది. ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీని వినిల్ మాథ్యూ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించారు.