Site icon NTV Telugu

Taapsee Pannu : ‘ముల్క్’ మూవీ సీక్వెల్‌ను మొద‌లెట్టిన తాప్సీ..!

Malk

Malk

టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్ని బాలీవుడ్‌కి జంప్ అయిన హీరోయిన్‌లలో తాప్సీ పన్ను ఒకరు. అనతి కాలంలోనే తెలుగులో వరుస సినిమాలు తీసి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ్‌లో కూడా నటించింది. కానీ ప్రజంట్ మాత్రం బాలీవుడ్‌కే పరిమితం అయ్యిన తాప్సి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఆడియ‌న్స్‌ను అల‌రిస్తూ వ‌స్తుంది. ఇటు నిర్మాతగా కూడా తన లక్‌ని పరిక్షించుకుంటుంది. అయితే 2018లో తాప్సీ నటించిన ‘ముల్క్’ సినిమా ఎంత మంచి టాక్‌ను తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు.

Also Read : Devi Sri Prasad : దర్శకులను ఆకాశానికెత్తేసిన దేవీశ్రీ ప్రసాద్..

ముస్లిం కుటుంబానికి చెందిన మురాద్ అలీ, మొహ‌మ్మద్ ఉగ్రవాదంలో చిక్కుకున్న త‌ర్వాత కోల్పోయిన గౌర‌వాన్ని తిరిగి పొంద‌డానికి చేసే ప్రయ‌త్నంగా ఈ ‘ముల్క్’ మూవీ రూపొందించారు. ఈ సినిమాలో తాప్సీ తో పాటుగా రిషి క‌పూర్, పాటూ ర‌జ‌త్ క‌పూర్, మ‌నోజ్ ప‌హ్వా, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానా, నీనా గుప్తా, ప్రాచీ షా పాండ్యా కూడా న‌టించారు. తాప్సీ‌తో పాటూ రిషి క‌పూర్ యాక్టింగ్ ర‌క్తి క‌ట్టించి ఆడియ‌న్స్‌ను మ‌రింత ఆక‌ట్టుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ‘ముల్క్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ముల్క్2’ రాబోతుంది.  ఈ సీక్వెల్‌కు కూడా అనుభ‌వ్ సిన్హానే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.  తాప్సీ మ‌రోసారి తన అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ చేసేందుకు సిద్ధం అయ్యింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version