Site icon NTV Telugu

Swathi Mutyam: ఇంకాస్తంత ముందుకు ‘స్వాతి ముత్యం’!

Swathimutyam

Swathimutyam

Swathi Mutyam: బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయం అయిన సినిమా ‘స్వాతిముత్యం’. ఈ నెల 5న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. దాంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో ప్రదర్శించాలని ఆహా సంస్థ భావించింది. దానికి తగ్గట్టుగానే బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘స్వాతి ముత్యం’ను ఇదే నెల 28న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలిపింది.

Read also: Cm Jaganmohan Reddy: రైతన్నల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం

అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే మనసు మార్చుకుని, పబ్లిక్ డిమాండ్ మేరకు దీపావళి కానుకగా ‘స్వాతిముత్యం’ను 24వ తేదీనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. అంటే… ఈ సినిమా విడుదలైన 19 రోజుల్లోనే ఓటీటీలో వచ్చేస్తోందన్న మాట. సో… దీపావళి పండగ సందర్భంగా ఓ పక్క పిండి వంటలు లాగిస్తూ, ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నూ ఆస్వాదించొచ్చు!
Karnataka: అన్నదానానికి రూ.లక్ష విరాళం.. ఆ యాచకురాలికి ఇదేం కొత్త కాదు.. ఇది ఎన్నోసారో తెలుసా..

Exit mobile version