Scene Trailer: వైవిధ్యమైన కథలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసే స్టార్ హీరో సూర్య, ఈసారి మరో క్రేజీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ‘రోమాంచమ్’, ‘ఆవేశం’ వంటి సెన్సేషనల్ హిట్స్‌తో సౌత్‌లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మలయాళ డైరెక్టర్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘సీన్’ (#Scene). తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే సూర్య ఇందులో ‘ఇన్బరాజ్’ అనే మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించినట్లు అర్థం అవుతోంది. డిపార్ట్మెంట్లో ఎవరినీ ఖాతరు చేయని ఒక తిరుగులేని లెజెండ్ కాప్.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సడన్‌గా ఉద్యోగానికి రాజీనామా చేసి అందరికీ షాకిస్తాడు. ఎందుకు రిజైన్ చేశావంటే.. “నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను” అంటూ కూల్‌గా చెప్పి ఇంట్లో పని కోసం మాయ (నజ్రియా నజీమ్) అనే హెల్పర్‌ను పెట్టుకుని రిలాక్స్ అవ్వడం మొదలుపెడతాడు.
అయితే అదే సమయంలో నగరంలో ఓ సైకో కిల్లర్ ఎంట్రీతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. “నాకు సమానుడైన ప్రత్యర్థిని తీసుకురండి” అంటూ ఈశ్వరన్ అనే కిల్లర్ విసిరే సవాల్‌తో.. మాజీ పోలీస్ ఇన్బరాజ్ రంగంలోకి దిగక తప్పదు. అయితే సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా కాకుండా, ఆ సైకో కిల్లర్‌తో సూర్య ఆడే మైండ్ గేమ్స్ నవ్వులు పూయిస్తూనే సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను పంచాయని అనిపిస్తుంది. ఎదురుగా బాంబు పట్టుకుని విలన్ బెదిరిస్తుంటే.. “అలెక్సా.. ఏదో ఒక మంచి మూడ్ మ్యూజిక్ ప్లే చెయ్” అంటూ సూర్య చేసే హంగామా ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. “నేను ఒక్క దెబ్బ కొడితే ఒంటిమీద ఒకటిన్నర టన్ను బరువు పడుతుంది” అంటూ చివర్లో ఆయన చెప్పే మాస్ డైలాగ్, తెరపై కనిపించే విజువల్స్ ఫ్యాన్స్‌కు మస్త్ ట్రీట్ ఇస్తాయి. నజ్రియా క్యూట్ యాక్టింగ్, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ విలన్ రోల్, సుశిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. డార్క్ కామెడీకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోడించి జితు మాధవన్ తెరకెక్కించిన ఈ ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రచ్చ లేపడం ఖాయమని సూర్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

