NTV Telugu Site icon

‘నారప్ప’లో మార్పులు సూచించిన సురేష్ బాబు…!?

Suresh Babu suggests changes to Venkatesh's Narappa

విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా ‘నారప్ప’. తమిళంలో భారీ హిట్ కొట్టిన‌ ‘అసురన్‌’కు రీమేక్‌ గా తెరకెక్కుతోంది ‘నారప్ప’. తాజాగా సురేష్ బాబు ‘నారప్ప’లో కొన్ని మార్పులను సూచించాడట. ‘నారప్ప’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఇటీవలే మాట్లాడిన సురేష్ బాబు ఫైనల్ కట్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించారట. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమన్నారట. ఇక ‘నారప్ప’కు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 14న విడుదల కాబోతుంది. సమాజంలోని అసమానతలు, చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ సినిమా రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మ‌రోవైపు వెంక‌టేష్ ‘ఎఫ్ 3’, ‘దృశ్యం 2’ సినిమాలతో బిజీగా ఉన్నారు.