విక్టరీ వెంకటేష్-ప్రియమణి జంటగా నటించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20న ఓటీటీలో విడుదల కాబోతుంది. కాగా, అగ్ర నిర్మాత అయినటు వంటి సురేష్‌బాబు ఈ సినిమాను ఓటీటీ బాట తీసుకెళ్లడంతో ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది వివాదంగా మారడంతో తాజాగా నిర్మాత సురేష్‌బాబు స్పందించారు. సినిమా ఓటీటీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. కళైపులి ఎస్ థాను తీసుకున్న నిర్ణయమన్నారు. ఇక దృశ్యం 2, విరాట పర్వం సినిమాలు కూడా ఓటీటీలోనే విడుదల కానున్నాయనే వస్తున్న వార్తలపై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. తమిళ దృశ్యం 2 సినిమా ఓటీటీలోనే విడుదల అయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ.. తెలుగులోనూ ఓటీటీలోనే విడుదల అవుతుందా.. లేదా అనేది నిర్మాతల ఇష్టమని చెప్పారు. ఇక విరాటపర్వం సినిమా 5 డేస్ షూటింగ్ ఉందని తెలిపాడు. తెలంగాణలో జరిగిన ఒక యదార్థ కథగా వస్తుందన్నారు. అయితే ఈ చిత్రం ఓటీటీ వైపు వెళ్లపోవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమాలు ఓటీటీ వైపు వెళ్ళటం తనకు బాధగానే ఉంటుందని.. తనకు కూడా థియేటర్స్ ఉన్నాయని తెలిపాడు. కానీ నిర్మాతలు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ వస్తున్నారు. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి నేను ఏమి చేయలేకపోతున్నాను అంటూ సురేష్ బాబు తెలిపారు.
దృశ్యం 2, విరాట పర్వం విడుదలపై క్లారిటీ!
