Site icon NTV Telugu

సురేఖావాణి@బిగ్ బాస్ 5

Surekha Vani Deleted Post about her Bigg Boss-5 Entry

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ సీజన్ లోగో ఆవిష్కరించారు. వచ్చే నెలలో సీజన్ 5 ను మొదలు పెట్టడం ఖాయం. అన్నపూర్ణ ఏడెకరాలలో బిగ్ బాస్ సీజన్ 5 సెట్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇక మరో వైపు పోటీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఫైనల్ లిస్ట్ ఎంపిక పూర్తవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్ లో సీనియర్ నటీనటులని హౌస్ లోకి పంపిస్తూ వస్తున్నారు. గతంలో హేమ.. కరాటే కళ్యాణి వంటి వారు అలా హౌస్ లోకి వెళ్ళారు. ఈ సీజన్ లో సీనియర్ నటి సురేఖ వాణి అలా వెళుతుందనే వార్తలు లీక్ అయ్యాయి. గత సీజన్స్ లో కూడా సురేఖావాణి ఎంట్రీపై ఫీలర్స్ వచ్చినా అమె ఖండిచటం జరిగింది. ఆమె బిగ్ బాస్ పై అంత ఆసక్తి కూడా చూపించలేదు. అయితే సీజన్ 5 కు ఓకే చెప్పిందని గట్టిగా వినిపించటంతో సోషల్ మీడియాలో తాను బిగ్ బాస్ కు వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. అవి ఫేక్ న్యూస్ అనేసింది. దీంతో ఇక ఈ సీజన్ లోనూ సురేఖ బిగ్ బాస్ లో ఉండదని అనుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఫేక్ అంటూ తను పోస్ట్ చేసిన స్టోరీని డిలీట్ చేయడంతో ఈ సారి అమ్మడు ఎంట్రీ కన్ఫామ్ అంటున్నారు.

Read Also : ఓటిటిలో సూర్య “జై భీమ్” ?

మొదట బిగ్ బాస్ టీమ్ తో జరిపిన చర్చలు ఫలించలేదట. అందుకే బిగ్ బాస్ వార్తలు ఫేక్ అని పోస్ట్ చేసింది సురేఖ. ఆ తర్వాత చర్చలు సఫలం కావడం వల్ల ఎంట్రీ కి ఓకే చెప్పిన సురేఖావాణి ఫేక్ అంటూ పెట్టిన పోస్ట్ డిలీట్ చేసి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 5 లో సురేఖ ఎంట్రీ ఖాయం అని క్లూ ఇచ్చినట్లు అయ్యింది. బిగ్ బాస్ కు వెళ్లబోతున్నవారు ఎవరూ ఆవిషయాన్ని రివీల్ చేయకూడదు. నిజంగా వెళ్లకుంటే మళ్లీ ఫేక్ న్యూస్ అని పోస్ట్ చేయవచ్చు. ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ సారి సురేఖావాణి బిగ్ బాస్ ఎంట్రీ ఖాయం అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో!?

Exit mobile version