Site icon NTV Telugu

Mohan Family: మంచు మోహన్ బాబు, విష్ణులకు సుప్రీంలో ఊరట!

Manchu

Manchu

సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. ఆయనకే కాదు ఆయన కొడుకు మంచు విష్ణుకు కూడా ఊరట లభించింది. ఈ మధ్య ఈ విషయం వచ్చినా మంచి వ్యవహారాలు వివాదస్పదంగా మారుతున్నాయి.. అయితే వీళ్ళకి లభించిన ఊరట మాత్రం 2019లోని ఎన్నికల కోడ్ కేసులో… ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 2019లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచి విష్ణు లు ఆందోళన నిర్వహించారు.. దాంతో తండ్రి కొడుకులు పై ఎఫ్ ఆర్ నమోదయింది..

2019 మార్చి 22న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలను చేయాలంటూ మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ సహా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల సిబ్బంది నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ నిరసనలో ఆంధ్రప్రదేశ్‌ లోని ఒకటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు కూడా చేశారు.

Also Read : High Court: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. 3రోజులు టైమ్..!

అయితే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా, అప్పటి ఎన్నికల అధికారి హేమలత కు పిర్యాదు అందింది . మోహన్ బాబు అండ్ కో చేసిన ఆందోళన నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందని కంప్లైంట్ చేశారు.. దాంతో పోలీసులు మోహన్ బాబు, విష్ణు బాబుపై IPC సెక్షన్‌లు 290, 341, 171-F తో పాటూ crpc 1861 సెక్షన్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది..

అయితే తనతో పాటు తన కుమారులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలనీ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మోహన్ బాబు చేసిన అభ్యర్థనను నిరాకరించింది.. దాంతో సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం, మోహన్ బాబు, ఆయన కుమారుడు దాఖలు చేసిన అభ్యర్థనను సమర్థించింది. మంచు మోహన్ బాబు, ఆయన కుమారులపై చేసిన అభియోగాలు సరిపోవని స్పష్టం చేస్తూ.. మోహన్ బాబు, ఆయన కుమార్లపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసింది సుప్రీంకోర్టు.

Exit mobile version