Site icon NTV Telugu

Srikanth Addala : రేలంగి మావయ్యగా సూపర్ స్టార్ రజినీకాంత్

Untitled Design (73)

Untitled Design (73)

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి పరిచయం అక్కర్లేదు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అందుకున్న అయిన దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు మహేష్ బాబుతో ఇలాంటి సినిమా ట్రై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పటికి టీవీలో, యూట్యూబ్‌లో చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. అయితే ఈ మూవీని మార్చి 7 రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా, పాత వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చి ఫ్యాన్స్‌ని ఆశ్చర్య పరుస్తుంది.

Also Read: Rashmika : రష్మికతో ఆ మూవీ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్?

ఈ వీడియో లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రేలంగి మామయ్య పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఇంత కీలకమైన రేలంగి మావయ్య క్యారెక్టర్‌ని అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రజని అయితే బాగుంటుందని దిల్ రాజు తో చెప్పాను. శంకర్ రికమండేషన్ ద్వారా  ఆయన అపాయింట్మెంట్ దొరికింది. ఆయనను కలవడానికి నేను చెన్నై వెళ్లాను. ముందు మేకప్ లేకుండా వచ్చిన రజని చూసి ఠక్కున గుర్తుపట్టలేదు. ఆయన ఒక గంట టైం ఇచ్చారు కథ చెప్పాను ఆయనకు బాగా నచ్చింది. కానీ ఆ టైం లో అనారోగ్యం కారణంగా రజనీకాంత్ నో అన్నారు’ అని శ్రీకాంత్ తెలిపారు. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version