Site icon NTV Telugu

SSMB : లిటిల్ హార్ట్స్ సినిమాకు ‘లిటిల్ హార్ట్స్ సేవియర్’ సూపర్ స్టార్ మహేశ్ స్పెషల్ విషెస్

Ssmb

Ssmb

#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది.  పోటీలో బడా సినిమాలు ఉన్న కూడా వాటిని వెనక్కి నెట్టి ప్రీమియర్స్ షోస్ నుండే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 34 కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది లిటిల్ హార్ట్స్.

Also Read : Star Hero : ప్లాప్ దర్శకులకు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్న స్టార్ హీరో

తాజాగా లిటిల్ హార్ట్స్ యూనిట్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ” లిటిల్ హార్ట్స్ చాలా సరదాగా ఎంతో కొత్తగా ఉంది. ఆలాగే ఈ సినిమాలో క్యాస్టింగ్ సూపర్బ్ గా ఉంది.. ముఖ్యంగా చిన్నపిల్లలు తమ నటనతో అదరగొట్టారు. ఫినామినల్ పర్ఫామెన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్… నువ్వు దయ చేసి ఫోన్ ఆఫ్ చేసి యెక్కడికి వేళ్ళకు బ్రదర్. నువ్వు రాబోయే రోజుల్లో చాలా బిజీగా ఉంటావు. కీప్ రాకింగ్, లిటిల్ హార్ట్స్ టీమ్ మొత్తం బృందానికి అభినందనలు’ అని ట్వీట్ చేసారు. మహేశ్ బాబు ట్వీట్ చేయడంతో లిటిల్ హార్ట్స్ యూనిట్ వారి ఆనందం మరింత రెట్టింపు అయింది. రిలీజ్ అయి రెండు వారాలు దాటినా కూడా లిటిల్ హార్ట్స్ ఇప్పటికి థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది.

Exit mobile version