NTV Telugu Site icon

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ మెచ్చిన చిత్రం..ఆ సినిమాలో ఏముంది..?

Untitled Design (2)

Untitled Design (2)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం లుక్ మార్చే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేశ్ మునుపెన్నడు లేని విధంగా ఎప్పుడు చూడని మహేశ్ ని చూస్తారని రాజమౌళి యూనిట్ నుండి సమాచారం అందుతోంది. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ చిత్రాన్ని జర్మనీలో జరిగే రెగ్యులర్ షూటింగ్ తో మొదలు పెట్టనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ పరిశీలిస్తోంది.

కాగా మంచి చిత్రాలను అభినందించంలో ముందుంటాడు ఘట్టమనేని ప్రిన్స్. చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరిని ఆకట్టుకుని సరికొత్త కధాంశంతో వచ్చే సినిమాలను ఎప్పుడు అభినందిస్తారు మహేశ్. ఈ కోవలో ఇటివల తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘రాయన్’ చిత్రాన్ని కొనియాడారు మహేశ్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ‘రాయన్’ లో ధనుష్ నటన అమోఘం పాత్రలో జీవించాడు, ధనుష్ నటన దర్శకత్వం అద్భుతం, SJ సూర్య యాక్టింగ్ వేరే లెవల్, అలాగే ప్రకాష్ రాజ్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ బ్రిలియంట్ గా నటించారు, Ar రెహమాన్ సంగీతం, నేపధ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచారు, ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా, ఇటువంటి సినిమా అందించినసన్ పిక్టర్స్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ మహేశ్ వ్యక్తిగత సోషల్ మీడియా ‘X’ లో పోస్ట్ పెట్టారు సూపర్ స్టార్ మహేశ్.

Also  Read: Tollywood: ఒకే నిర్మాణ సంస్థ నుండి రెండు భారీ సినిమాలు..వారం గ్యాప్ లో విడుదల

Show comments